Spirit: ‘స్పిరిట్’ దీపికా పదుకొణె అవుట్.. రుక్మిణి వసంత్ ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనంగా మారిన వార్త ఏంటంటే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’ నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తప్పుకుంది. తప్పించారనే ప్రచారం కూడా జరిగింది. ఆమె స్థానంలో కన్నడ సినిమా నటి రుక్మిణి వసంత్‌ను తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:Sai Srinivas : ఆ హీరోల లాగే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటా..
Also Read
- Klin Kaara : 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
- Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ 'అమృతం' లైవ్ మ్యాజిక్
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్'పై స్టార్ యాక్టర్ సంచలనం!
‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ప్రభాస్‌తో కలిసి నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపికా పదుకొణె, ‘స్పిరిట్’ సినిమాలోనూ హీరోయిన్గా నటించనుందని అందరూ భావించారు. అయితే, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి పలు కారణాలు చెబుతున్నారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, దీపికా 8 గంటల వర్కింగ్ షిఫ్ట్, రూ. 20 కోట్ల రెమ్యునరేషన్, సినిమా లాభాల్లో వాటా, తెలుగు డైలాగ్స్ చెప్పడానికి నిరాకరణ వంటి షరతులు వివాదాస్పదమయ్యాయి. కొందరు ఈ డిమాండ్స్‌ను అసమంజసంగా భావిస్తుండగా, మరికొందరు దీపికా తన విలువ తెలుసుకుని, న్యాయమైన డిమాండ్స్ చేసిందని సమర్థిస్తున్నారు. ఆమె తాజాగా తల్లి కావడం, కెరీర్‌తో పాటు తల్లిదండ్రుల బాధ్యతలను సమతుల్యం చేయాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయంలో ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది.
Also Read:Bhairavam : ఆ యాక్షన్ సీన్ లో రోహిత్ అదిరిపోయాడు.. మనోజ్ ప్రశంసలు..
‘స్పిరిట్’ సినిమాలో దీపికా స్థానంలో రుక్మిణి వసంత్‌ను తీసుకునేందుకు చిత్ర బృందం చర్చలు జరుపుతోందని టాక్. రుక్మిణి వసంత్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. 2019లో ‘బిర్బల్ ట్రిలాజీ’ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆమె, 2023లో ‘సప్త సాగరదాచే ఎల్లో’ (సైడ్ ఏ & సైడ్ బీ) సినిమాలతో భారీగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ప్రియ పాత్రలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ కూడా దక్కింది. తెలుగులో కూడా ఆమె నిఖిల్ సిద్ధార్థతో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో డెబ్యూ చేసింది, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!