పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇంకా మొదలే కాలేదు, కాని నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. ఇందులో ముందుగా దీపికా పదుకొణేని హీరోయిన్‌గా అనుకొని ఆమెకి స్టోరీ కూడా చెప్పాగా.. ఆమె అనేక కండీషన్స్ పెట్టడంతో సందీప్.. యానిమల్ హీరోయిన్‌ని సంప్రదించి ఆమె ఫైనల్ అయ్యాక స్పిరిట్ హీరోయిన్ ‘త్రిప్తి డిమ్రి’ అని అఫీషియల్‌గా ప్రకటించాడు. ప్రభాస్ మూవీలో అవకాశం ఇవ్వడంతో అమ్మడు ఆనందానికి అవధులు లేవు..ఇక తాజాగా త్రిప్తి రెమ్యూనరెషన్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది..
Also Read : Kubera : నాగార్జునపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ధనుష్ ..
అయితే దీపికా పదుకొనేని ఈ సినిమా నుండి తొలగించడానికి ఆమె రూ.20 కోట్ట పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే అని.. అంతేకాకుండా, ఆమె ఇటీవలే తల్లి అయినందున షూటింగ్ సమయాన్ని తగ్గించాలని కోరడం సందీప్‌కి నచ్చలేదట. ఇలా చాలా వార్తలు వైరల్ అయినప్పటికి.. చివరకు ఆమె స్థానంలో త్రిప్తి వచ్చి చేరింది. అయితే ఈ సినిమాకి త్రిప్తికి గాను ఏకంగా రూ. 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం.. ఇదే నిజమైతే త్రిప్తి జాక్‌పాట్ కొట్టేసినట్టే.
