కుర్రాళ్ల కలల రాణి అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మలయాళ కుట్టి, ఈ సినిమాలో రావు రమేష్ కూతురు వల్లీగా టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్ అదరగొట్టింది.ఇక నేడు ఫిబ్రవరి 18న ఈ అమ్మడు పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా అనుపమ బర్త్ డే కానుకగా ఆమె నటిస్తున్న ‘పరదా’ మూవీ నుండి ఒక వీడియో ని వదిలారు.
Also Read:Varun Sandesh: ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లింగ్ మూవీ..
సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తుండగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు సంగీత ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటివల రిలీజైన ఈ సినిమా టీజర్‌కు ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక ఊరిలో ప్రతి అమ్మాయి ముఖాన్ని పరదా తో దాచుకుంటారు. అదే టైమ్‌లో ఊర్లో ఒక అంతుచిక్కని సమస్య. అసలు ఆ సమస్య ఏంటి?.. ఆ సమస్యకు ముగింపు పలకడానికి అనుపమ ఏం చేస్తుంది? అసలు అందరూ అలా పరదాలు వేసుకోవడం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? అనేది కథ. ఇక రీసెంట్ గా వదిలిన వీడియో లో అనుపమ ఊయల ఊగుతూ.. పరదాలమ్మ పరదాలు అంటూ అరుస్తూ కనిపించింది.ఈ సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ కాబోతుంది.