ఎప్పుడో చనిపోయిన ఒక గాయకుడి గొంతును ఏఐ సహాయంతో మళ్లీ రీ క్రియేట్ చేసి ఏఆర్ రెహమాన్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు అని అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే రెహమాన్ కంటే ముందే మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని ఏఐ సహాయంతో రీ క్రియేట్ చేశారు. అయితే ఈ విషయం మీద ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కీడాకోలా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య రావు, జీవన్, విష్ణు వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. అయితే ఒక చిన్న కామెడీ సీక్వెన్స్ లో భాగంగా మా ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని ఏఐ ద్వారా రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. స్వాతిలో ముత్యమంత అనే సాంగ్ సినిమాలో ఒక కామెడీ సీక్వెన్స్ కోసం వాడారు. దాని కోసమే ఏఐ ద్వారా సాంగ్ రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read; Pakistan Army: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రధాని పదవిని ఆఫర్ చేసిన పాక్ ఆర్మీ.. కానీ, కండిషన్స్ అప్లై
ఈ విషయం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన జనవరి 18వ తేదీన సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సహా సినీ దర్శక నిర్మాతలకు కూడా నోటీసులు పంపారు. అయితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మీద ఎస్పీ చరణ్ స్పందిస్తూ నాకు దూరమైన మా తండ్రి వాయిస్ ని ఏ ద్వారా రీ క్రియేట్ చేయడం బాగుంది , చనిపోయినా ఆయన గొంతుకు ఇంకా జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేము స్వాగతిస్తున్నాం కానీ కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా ఇలా ఆయన గొంతును రీక్రియేట్ చేయడం మాకు బాధ కలిగించిందనీ అన్నారు. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరి కాదు’ అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకే ఈ విషయంలో లీగల్ గా ముందుకు వెళ్లాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.