NTV Telugu Site icon

Fateh Teaser: సోనూ సూద్ ‘ఫతే’ టీజర్ అదిరిందిగా

Fateh

Fateh

విభిన్న పాత్రలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ కథానాయకుడిగా నటిస్తూ, రచన-దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫతే’. సోనూ సూద్ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఫతే చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ, ఫతే నుంచి టీజర్ విడుదలైంది. 80 సెకన్ల నిడివి గల ఫతే టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బుల్లెట్ల వర్షం కురిపించి, గన్ పట్టుకొని నిల్చొని ఉన్న సోనూ సూద్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమైంది. ప్రతి ఫ్రేమ్ లోనూ భారీతనం కనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. వయలెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని టీజర్ స్పష్టం చేసింది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను చంపేస్తా.. ఫోన్ కాల్స్ కలకలం !

విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. సోనూ సూద్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే, వయలెన్స్ తో కూడిన అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ తో సోనూ సూద్ బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతున్నారని అర్థమవుతోంది. దర్శకుడిగా చేస్తున్న తొలి చిత్రానికి, సోనూ సూద్ బలమైన కథను ఎంచుకున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాంటి ఆసక్తికరమైన సైబర్ క్రైమ్ అంశాన్ని కథా వస్తువుగా తీసుకొని, దాని చుట్టూ బలమైన కథను అల్లుకున్నారు సోనూ సూద్. సైబర్ క్రైమ్ సిండికేట్ ను ఢీ కొట్టి, ఆ చీకటి సామ్రాజ్యంలోని రహస్యాలను ఛేదించి, ఎందరో జీవితాల్లో వెలుగులు నింపే వ్యక్తిగా సోనూ సూద్ కనిపిస్తున్నారు. ప్రారంభం నుంచి చివరి వరకు.. తర్వాత ఏం జరుగుతోందన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ, ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసే సినిమాగా సోనూ సూద్ ఫతే చిత్రాన్ని మలుస్తున్నారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని పంచడం కోసం, ఈ చిత్రం కోసం ప్రముఖ హాలీవుడ్ సాంకేతిక నిపుణులను సైతం రంగంలోకి దింపారు.