NTV Telugu Site icon

Kumari Aunty: కుమారి ఆంటీని సన్మానించిన రియల్ హీరో సోనూ సూద్

Sonu Sood Felicitated Kumari Aunty

Sonu Sood Felicitated Kumari Aunty

Sonu Sood Felicitated Kumari Aunty: కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేసి అప్పటి వరకు విలన్ అని పేరు తెచ్చుకున్న సోను ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇక ఆ సహాయం చేస్తూ వచ్చిన ఇమేజ్ తో విలన్ గా సినిమాలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించి సినిమాలు చేయడం కూడా ఆయన తగ్గించేశాడు. బాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా చేసిన ఫతే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే తాజాగా హైదరాబాద్ వచ్చిన సోనూసూద్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నానని సోనుసూద్ చెప్పుకొచ్చాడు. ఆమె తనను తాను ఈ స్థాయికి తెచ్చుకుందని వుమెన్ ఎంపవర్మెంట్ కి నిజమైన అర్థం ఇదేనని అన్నారు.

Bhole Baba : వందలకోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు..హత్రాస్ బాబా నిజస్వరూపం ఇదే!

కుటుంబాల కోసం స్త్రీలు ఎంత కష్టపడుతున్నారనేది కుమారి ఆంటీ సజీవ సాక్ష్యం అని సోనూసూద్ అన్నాడు. ఎవరి కుటుంబాలైతే ఇబ్బందుల్లో ఉన్నాయో వాళ్ళు కుమారి ఆంటీని చూసి నేర్చుకోవాలని ఇబ్బందుల్లో కూడా సరైన దారి ఎంచుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోకపోవచ్చు అని నిరూపించిందని అన్నారు. తాను వెజిటేరియన్ తింటానని ప్లేట్ ఎంత అని అడిగితే కుమార్ ఏంటి 80 రూపాయలు అని చెప్పింది. అయితే తనకి ఎంత డిస్కౌంట్ ఇస్తారు అని అడిగితే మీకైతే ఫ్రీగానే పెడతానని చెప్పుకొచ్చింది. అయితే నాకు లాటరీ తగిలింది ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని సోనూసూద్ అంటే మీరు ఎంతోమందికి సాయం చేశారు మీకు మేము ఎంత పెట్టినా తక్కువే అని కుమారి ఆంటీ చెప్పు వచ్చింది. ఇక ఈ సందర్భంగా కుమారి ఆంటీని సోను సత్కరించాడు. తర్వాత కుమారి ఆంటీ కుమార్తె యామిని, కుమారుడు ధనుష్ తో కలిసి ఫోటోలు దిగాడు.

Show comments