Site icon NTV Telugu

Sonu Nigam : క్షమాపణ చెప్పినా కూడా వదలడం లేదుగా..

Sonu

Sonu

నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. సెలబ్రెటీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే  తీవ్రమైనా పరిణామాలు ఎదురుకొవాల్సి వస్తుంది. ప్రజంట్ బాలీవుడ్ సింగ‌ర్ సోనూనిగమ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇటీవ‌ల‌ బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో ఒక విద్యార్థి కన్నడ పాట పాడమని కోరగా, సోనూ నిగమ్ ‘కన్నడ, కన్నడ, అంటూ ఇలాంటి విబేధాల తోనే పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు కాస్తా కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోను నిగమ్‌తో ఉన్న అన్ని ఒప్పందాలను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే సోను సోషల్ మీడియాలో భాగంగా వారికి క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ క‌న్నడ ప్రజ‌లు అత‌డిని క్షమించేలా క‌న‌ప‌డ‌ట్లేదు.

Also Read : Samantha : ‘శుభం’ మూవీలో నటించడానికి కారణం ఇదే..

తాజాగా ఆయన పాడిన పాట‌ను సినిమా నుంచి తొల‌గించిన‌ట్లు కులదల్లి కీల్యావుడో అనే చిత్రయూనిట్ ప్రక‌టించింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా.. ప్రక‌ట‌న విడుద‌ల చేసింది.. ‘సోను నిగమ్ గొప్ప గాయకుడని మాకు తెలుసు. కానీ ఇటీవల ఆయన కన్నడ భాష గురించి మాట్లాడిన విధానం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. కన్నడ భాషకు జరిగిన ఈ అవమానాన్ని మేము ఎంత మాత్రం సహించలేము. అందుకే, ఆయన పాడిన పాటను చిత్రం నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాము’ అని పేర్కొన్నారు. అయితే సోను నిగమ్ ఆలపించిన ‘మనసు హాడతాడే’ అనే ఈ పాట విడుదలకు ముందే మంచి స్పందన ను అందుకుంది. కానీ ఈ వివాదం కారణంగా ఆ పాటను చిత్రం నుంచి తీసేశారు.

Exit mobile version