ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్, బిలియనీర్ ఆనంద్ అహుజా దంపతులు లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న రాయల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఓ పాత బంగళాను ఏకంగా రూ. 270 కోట్లకు కొని, దాన్ని సర్వాంగ సుందరంగా రీమోడలింగ్ చేయిస్తున్నారు. అయితే, ఆ పక్కనే ఉన్న ఒక బిల్డింగ్‌లో సుమారు రూ. 51.4 కోట్లు (4 మిలియన్ పౌండ్లు) ఖర్చు చేసి ఐదు ఫ్లాట్లను సొంతం చేసుకోవడం స్థానిక బ్రిటీష్ నివాసితులకు అస్సలు నచ్చడం లేదు. ఆ ఫ్లాట్లను కేవలం తమ బంగళాలో పనిచేసే సిబ్బంది (Servant Quarters) కోసమే కొన్నారనే టాక్ రావడంతో స్థానికులు లీగల్ రూట్‌లో పోరాటానికి దిగారు.
ఈ ఆస్తి కొనుగోలు వెనుక సోనమ్ కపూర్ దంపతులకు చెందిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందని బ్రిటీష్ మీడియా ‘డెయిలీ మెయిల్’ పేర్కొంది. కానీ, ఆ అపార్ట్‌మెంట్‌లో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న లండన్ వాసులు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడంతో సోనమ్ కపూర్ ప్రతినిధులు దీనిపై త్వరితగతిన స్పందించారు. ఈ ఫ్లాట్ల కొనుగోళ్లకు, కపూర్ కుటుంబానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. సదరు కంపెనీ కేవలం భవిష్యత్తు వ్యాపార పెట్టుబడి (Investment) కోసమే ఆ ఆస్తులను కొనుగోలు చేసిందని, పనిమనుషుల క్వార్టర్స్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ ఎగుమతి సంస్థ అయిన ‘షాహీ ఎక్స్‌పోర్ట్స్’ వారసుడిగా, ‘భానె’ మరియు ‘వెజ్‌నాన్‌వెజ్’ బ్రాండ్ల అధినేతగా ఆనంద్ అహుజాకు అంతర్జాతీయంగా భారీ బిజినెస్ నెట్‌వర్క్ ఉంది. ఈ ఏడాది మార్చిలోనే ఈ దంపతులకు రెండో సంతానంగా రుద్రలోక్ జన్మించగా.. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా సాగుతున్న తరుణంలో లండన్ వాసుల నుండి వచ్చిన ఈ లీగల్ ఎలిగేషన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
