బిగ్ బాస్ షోలోకి ఆ మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చింది సోఫియా హయత్. అయితే, ప్రస్తుతం దుమారం రేపుతోన్న రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఆమె కూడా స్పందించింది. తాను బిగ్ బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ ఇంటిమేట్ సీన్స్ చేయాలని అభ్యర్థించాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. నిజంగా ప్రొఫెషనల్ గా శృంగార సన్నివేశాలు చిత్రీకరించే వాళ్లు ఎవరూ ముందుగా సెక్స్ సీన్స్ చేసి చూపించమని అడగరంటోంది సోఫియా. గతంలో ఆమె కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో బెడ్ రూం సీన్స్ చేసింది. అప్పుడు ఎవరూ తనని ముందుగా వచ్చి ‘రిహార్సిల్స్’లాగా ‘చేయమని’ చెప్పలేదట! కాబట్టి, సదరు ఏజెంట్ మాటల్ని సొఫియా నమ్మలేదట.
Read Also : సాంగ్ : “రాజ రాజ చోర” నుంచి చోరుడు వచ్చేశాడు !
బాలీవుడ్ లో యాక్టర్స్ గా ఎదగాలని కలలుకనే అమ్మాయిల్ని చాలా మంది మోసం చేసే అవకాశం ఉందని సొఫియా అభిప్రాయపడింది. డబ్బుల కోసం ఏదైనా చేసే బిజినెస్ మెన్ గ్లామర్ మోజులో ఉన్న యంగ్ గాళ్స్ ని ట్రాప్ చేస్తారని ఆమె చెబుతోంది. అవకాశాల పేరు చెప్పి పోర్న్ వీడియోస్ లో నటింపజేస్తారని హెచ్చరిస్తోంది. జాగ్రత్తగా ఉండాలని సోఫియా హయత్ అప్ కమింగ్ యాక్ట్రెసెస్ కి సూచన చేస్తోంది…
పోర్న్ గురించి ఘాటుగా స్పందించిన సొఫియా కోర్టులు కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడింది. అమ్మాయిల్ని మోసం చేసి పోర్న్ మూవీస్ లో నటింపజేస్తే… దాన్ని రేప్ తో సమానంగా పరిగణించాలని ఆమె అంటోంది. అసలు పోర్న్ కల్చర్ వల్ల జనం… ప్రేమ అంటే సెక్సే అనుకుంటున్నారని ఆమె వాపోయింది! సొఫియా హయత్ చెప్పింది నిజమే అయినప్పటికీ బిలియన్ల డాలర్లు విలువ చేసే బ్లూ ఫిల్మ్స్ బిజినెస్ అంత ఈజీగా కట్టడి అవుతుందా? కష్టమే అనేది అందరికీ తెలిసిన నిష్ఠూర సత్యం!
