శోభిత ధూళిపాళ్ల తన భర్త నాగ చైతన్య దగ్గర కార్ రేసింగ్ నేర్చుకుంటున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆమె ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, నాగ చైతన్యతో కలిసి కార్ రేసింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె తన భర్తతో కలిసి రేసింగ్ కార్ తో ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాగ చైతన్యకి కార్లు మరియు కార్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే. చైతన్య కార్ల పట్ల తనకున్న మక్కువను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చైతన్య భార్య శోభిత కూడా ఈ ఆసక్తిని పంచుకుంటూ, అతని దగ్గర రేసింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం విశేషం.
Gutta Jwala : తెలుగు సినిమాలకి తెల్లగా ఉంటే చాలు : గుత్తాజ్వాల హాట్ కామెంట్స్
ఈ జంట కలిసి రేసింగ్‌లో సమయం గడపడం వారి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని తెప్పిస్తోంది. శోభిత ధూళిపాళ్ల – నాగ చైతన్యల మధ్య బాండింగ్ చూస్తే వారి ప్రేమ ఎంత లోతైనదో అర్థమవుతుంది. నాగ చైతన్యకు కార్లు, రేసింగ్ అంటే ఇష్టమైనట్లే, శోభిత కూడా అతని ఆసక్తులను పంచుకుంటూ వారి సంబంధాన్ని మరింత బలపరుచుకుంటోంది. సినిమాల విషయానికి వస్తే కనుక నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. చందూ మొండేటి దర్శకత్వంలో, సాయి పల్లవితో కలిసి నాగ చైతన్య అద్భుత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అక్కినేని కుటుంబంలో 100 కోట్ల గ్రాస్ సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ, నాగ చైతన్య కెరీర్‌లో ఒక మైలురాయిగా మారింది.