NTV Telugu Site icon

Malluwood: వరంగా మారుతున్న చిన్న బడ్జెట్ సినిమాలు

Rekha

Rekha

స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాలీవుడ్ కు వరంగా మారాయి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓ చోటా పిక్చర్ సెన్సేషనల్ హిట్ అందుకుంది. మంచి వసూళ్లను రాబట్టుకొంటుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చిన్న సినిమాలకు బూస్టప్ గా మారింది. అలాగే మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రజెంటర్ గా మారి.. తన అసిస్టెంట్ ను డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే మాలీవుడ్ లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి రేఖా చిత్రం ఒకటి. ఐడెంటిటీ లాంటి స్టార్ట్ కాస్ట్ సినిమా బరిలో ఉన్నప్పటికీ డేర్ చేసి జనవరి 9న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది.

Kicha Sudeep: హీరోగా మరో స్టార్ హీరో మేనల్లుడు.. హీరోయిన్ గా ఫిక్సయిన కాజల్!

ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జస్ట్ రూ. 6 కోట్టు పెట్టి నిర్మించగా.. రూ. 50 కోట్లను వసూలు చేసింది. ప్రీస్ట్ తో హిట్టు ఇచ్చిన జోఫిన్ టి చాకో ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యామియో రోల్ లో నటించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ, అన్ మెగా మీడియా పతాకంపై వేణు కున్నాప్పిల్లీ నిర్మించాడు. స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్ గా మారబోతున్నాడు. తన దగ్గర అసోసియేట్ గా చేసిన మార్టిన్ జోసెఫ్ ను డైరెక్టర్ ను చేస్తున్నాడు. ఆర్డీఎక్స్ ఫేం షేన్ నిగమ్ హీరో. E4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్‌పై ముఖేష్ ఆర్ మెహతా మరియు సివి సారథి బెడ్‌టైమ్ స్టోరీస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. షేన్ నిగమ్ తమిళ చిత్రం మద్రాస్కారన్ తో పలకరించాడు.