Site icon NTV Telugu

SKN : ‘జాతిని..’ టీ-షర్ట్ వేసిన SKN.. వెనకున్న నిజం ఏంటో తెలుసా?

Skn Jathini T Shirt

Skn Jathini T Shirt

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్‌లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్ లుగా నటిస్తుండగా, థమన్ అందిస్తుండగా ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను, జూన్ 16న గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్‌తో పాటు మరో నిర్మాత SKN హాజరయ్యారు. అయితే SKN వేసుకున్న టీ షర్ట్ ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది. కారణం, ఆ టీ-షర్ట్‌పై ‘జాతిని..’ అనే పదం ఉండటమే.

Also Read : Sneha: ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం..!

ఈ పదం వల్ల కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉందని పలువురు భావించగా, SKN మాత్రం వెంటనే క్లారిటీ ఇచ్చారు.. ‘ఆ పదం ఎవరినీ, ఎలాంటి కులాన్ని ఉద్దేశించింది కాదు. నిజానికి, ‘ది రాజా సాబ్’ సినిమాలోని ఓ పాటలో ‘జాతిని..’ అనే పదం వస్తుంది, ఆ పాటను ప్రమోట్ చేయడానికే అలా టీ-షర్ట్ వేసుకున్న’ అని స్పష్టం చేశారు. తనదైన స్టైల్‌తో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునే SKN, ఈసారి తన టీ-షర్ట్ వల్ల వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది.

Exit mobile version