Site icon NTV Telugu

Madharaasi : ‘మదరాసి’ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిందిగా.. ఎక్కడంటే?

Madarasi

Madarasi

కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్  అయింది. అమరన్ వంటి సూపర్ హిట్ తర్వాత శివకార్తికేయన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అలాగే దర్బార్, సికిందర్ వంటి బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల తర్వాత మురుగుదాస్ చేసిన ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా అటు శివ కార్తికేయన్ కు ఇటు మురుగదాస్ కు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది.

Also Read : Devara : దేవర 2 లో తమిళ స్టార్ హీరో.. NTR బెస్ట్ ఫ్రెండ్ ఫిక్స్?

భారీ అంచనాలతో వచ్చిన మదరాసి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్ తప్ప కథ, కథనాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇటు తెలుగులోను అదే పేరుతో వచ్చిన మదరాసి ఇక్కడ కూడా ప్లాప్ అయింది. తమిళనాడు మాత్రం పర్లేదు అనే స్థాయిలో వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కేవలం రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టి శివకార్తీకేయన్ కెరీర్ లో మరొక ప్లాప్ గా మిగిలింది.  కాగా ఇప్పడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.  ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. థియేటర్ లో ప్లాప్ అవడంతో కాస్త ఎర్లీగా అక్టోబరు 1న అనగా ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసింది.  తెలుగు, తమిళ్ తో పాటు పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు అవుతోంది మదరాసి. మరి థియేటర్ లో ఓ మోస్తరుగా ఆడిన మదరాసి ఓటీటీలో ఏ మేరకు వ్యూస్ రాబడుతుందో.

Exit mobile version