తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (ఎస్కే) కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. కంటెంట్ ఆధారిత సినిమాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్టున్నారు. వరుసగా 100 కోట్ల క్లబ్‌లో తన సినిమాలను చేర్చి తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవలి కాలంలో శివకార్తికేయన్ నటించిన ఒక్కో సినిమా ఒక్కో జానర్‌లో తెరకెక్కినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అన్నీ ఘన విజయాలుగా నిలవడం విశేషం.
శివకార్తికేయన్‌కు తొలి రూ.100 కోట్ల సినిమా ‘డాక్టర్’. కరోనా వంటి కష్టకాలంలో విడుదలైనప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు శివకార్తికేయన్‌కు డెబ్యూ రూ.100 కోట్ల విజయాన్ని అందించింది. ఆ తర్వాత వచ్చిన ‘డాన్’ సాధారణ కాలేజ్ కథతో తెరకెక్కినా.. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇక ‘అమరన్’ సినిమా శివకార్తికేయన్ కెరీర్‌లో ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. యాక్షన్, ఎమోషన్ కలబోతగా రూపొందిన ఈ చిత్రం ఎస్కేకి ఓ మైలురాయి సినిమాగా నిలిచింది.
Also Read: ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం.. కింగ్ కోహ్లీని దాటేసిన డారిల్ మిచెల్!
పెద్దగా హడావుడి లేకుండా విడుదలైన ‘మధరాసి’ కూడా సైలెంట్‌గా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి శివకార్తికేయన్ మార్కెట్ స్టామినాను మరోసారి రుజువు చేసింది. తాజాగా వచ్చిన పీరియాడిక్ మూవీ ‘పరాశక్తి’ అయితే ఎస్కే కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. భారీ కథాంశం, గ్రాండ్ మేకింగ్‌తో రూపొందిన ఈ సినిమా పీరియడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి.. శివకార్తికేయన్ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఐదు సినిమాలు, ఐదు వేర్వేరు జానర్లు, ఐదు సార్లు 100 కోట్ల కలెక్షన్లు ఎస్కే ఖాతాలో ఉన్నాయి. ఈ రికార్డ్ తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక్క శివకార్తికేయన్ పేరుపైనే ఉంది. ప్రయోగాలకు భయపడకుండా కథను నమ్ముకుని ముందుకు సాగితే.. స్టార్‌డమ్ అదే వస్తుందనడానికి ఎస్కే బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తున్నారు.
