NTV Telugu Site icon

Sivakarthikeyan : అమరన్ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

Amaran Event

Amaran Event

తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ ను టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని విడుదల చేసారు.

Also Read : Bagavanth kesari : హిట్ కొట్టాడు.. కారు పట్టాడు..

తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేసారు. ఈ రోజు సాయంత్రం 6 హైదరాబాద్ లోని ITC ఖోహినూర్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ వేడుకలో చిత్ర హీరోయిన్ సాయి పల్లవి హాజరుకానుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇటీవల కల్కి వంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా రానున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ మరియు ఎమోషన్ మిళితమై, “అమరన్” ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన  ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు అద్భుత స్పందన లభించింది. తెలుగులో ఈ సినిమాను యంగ్ హీరో నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ ద్వారా రిలీజ్ కానుంది. మేజర్ ముకుందన్ కు ఈ సినిమా ఘనమైన నివాళిగా యూనిట్ చెప్తోంది.

Show comments