Site icon NTV Telugu

Sri Vishnu : #సింగిల్ డే – 2 సాలిడ్ రన్.. మొత్తం ఎంత రాబట్టిందో తెలుసా.?

Srivishnu

Srivishnu

శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం #సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయికలుగా నటించారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ తెచుకుంది.

Also Read : Vijay 69 : జననాయగాన్ విజయ్ పిక్ లీక్.. రీమేక్ అని కన్ఫర్మ్ అయినట్టే.?

మరి ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ తో కలిసి శ్రీ విష్ణు నవ్వించే సీన్స్, షార్ట్ పంచులతో కావలిసినంత కామెడీ ఇచ్చాడు. విడుదలైన రెండు రోజులకు గాను రూ. 11.02 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రిలీజ్ రోజు కంటే కూడా రెండవ రోజు ఎక్కవ కలెక్షన్స్ రాబట్టింది సింగిల్. మరోవైపు నేడు వీకెండ్ కావడం ఈ సినిమాకు మరింత కలిసొచ్చే అంశం. కేవలం మౌత్ టాక్ తోనే సింగిల్ దూసుకెళ్తోంది. ఆటు ఓవర్సీస్ లోను సింగిల్ చాలా స్ట్రాంగ్ గా నడుస్తోంది. ఇప్పటివరకు అక్కడ 300K డాలర్స్ కు పైగా రాబట్టి హాఫ్ మిలియన్ వైపు పరుగులు పెడుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు శ్రీ విష్ణు. పోటీలో మరే ఇతర సినిమాలు లేకపోవడం సింగిల్ లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

Exit mobile version