Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి ఎన్నో అద్భుత ప్రయోగాలు, సంచలన చిత్రాలను ఆవిష్కరించిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి తన మార్క్ ఆలోచనతో సింగ్ గీతం అనే సినిమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సింగీతం. 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం సినిమాపై చూపిస్తున్న పట్టుదల, ఎవరు ఊహించాని కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రియులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. ఒక వైవిధ్యమైన, విభిన్నమైన కథను సినిమా రూపంలోకి తీసుకురావాలనే సింగీతం ఆలోచనను గౌరవించి, దానికి అండగా నిలిచిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను ఈ సందర్భంగా ఖచ్చితంగా అభినందించాలి.
సింగీతం శ్రీనివాసరావుపై ఉన్న గౌరవంతో వినూత్న ప్రయోగానికి నాగ్ అశ్విన్ తోడ్పడడం విశేషం. గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన సింగ్ గీతం సినిమాకు బాక్సాఫీస్ టాక్‌తో కానీ, విశ్లేషకుల రివ్యూలతో కానీ అస్సలు పని లేదు. 94 ఏళ్ల వయసులో కూడా ఒక దర్శకుడు సినిమా కోసం చేసిన అద్భుతమైన ఐడియాని, ప్యాషన్‌ని ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి తప్పకుండా చూడాల్సిందే. ఈ వయసులో కూడా సింగీతం గారు కథను విజువలైజ్ చేసి తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ తన అద్భుతమైన మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడదగ్గ ఒక గొప్ప ప్రయోగం ఇది. ముఖ్యంగా క్లైమాక్స్ మిమ్మల్ని కదిలిస్తుంది. హాస్యం, మానవత్వం, సంగీతం, భావోద్వేగాలు కలిసి రూపొందిన అద్భుతమైన దృశ్య కావ్యం సింగ్ గీతం. అనుకూర్ సీ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో పెద్ద బలం. ఇంతకుముందు వెండితెరపై ఎప్పుడూ చూడని ఒక కొత్త సినీ ప్రయోగం. ఒక్క మాటలో చెప్పాలంటే సింగ్ గీతం ఓ మాస్టర్‌పీస్.
Also Read
- Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న 'రణబాలి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
- Nitesh Tiwari : 'రామాయణ' డైరెక్టర్‌కు అనశ్వర రాజన్'కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
- Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్‌తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
తాజావార్తలు
-
Damodar Raja Narasimha : హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
-
Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న ‘రణబాలి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
-
CM Chandrababu: రెబల్స్‌కు పార్టీలో నో ఎంట్రీ.. చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్‌కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!