NTV Telugu Site icon

Singer Sunita Son: ట్రోల్స్‌పై సింగర్ సునీత కొడుకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..!

Singer Sunitha Son

Singer Sunitha Son

ప్రారంభంలో సినీ వారసులకు ట్రోల్స్ తప్పవు. బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీకి వచ్చిన వారిపై ఏదోక విధంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. లుక్ పరంగానైనా, పర్ఫామెన్స్ పరంగానైనా.. తమ నచ్చని అంశంపై వారిని ట్రోల్స్ చేస్తూ అయిష్టాన్ని చూపిస్తుంటారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రేంజ్‌ను అందుకున్న రామ్ చరణ్‌ను చిరుత టైంలో ఓ ఆటాడుకున్నారు. ఇక నేషనల్ అవార్డు అందుకుని ఫస్ట్ టాలీవుడ్ హీరోగా గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌కు సైతం ట్రోల్స్‌ తప్పలేదు. ఇలా డెబ్యూ మూవీతో ప్రేక్షకుల నుంచి విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు.

Also Read: Vijayawada: ఆటో డ్రైవర్ నిజాయితీ.. ప్రయాణికురాలి నగలు బ్యాగు అప్పగింత

అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రముఖ సింగర్ సునీత కొడుకు వంతు వచ్చింది. సునీత కొడుకు ఆకాష్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ‘సర్కారు నౌకరి’ మూవీతో డెబ్యూ ఇవ్వబోతున్నారు. భావన కథానాయికగా చేస్తున్న ఈ మూవీని కే రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కే టెలీ షో బ్యానర్‌పై నిర్మితమవుతుంది. గంగనమోని శేఖర్‌ దర్శకుడు. ఈ మూవీ కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్బంగా మీడియాతో ఆకాష్‌ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ‘సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది.

కానీ దానిని నిలబెట్టుకోవాలంటే మనమే కష్టపడాల్సి ఉంటుంది. అందరిని ఆకట్టుకునేలా సినిమాలు, యాక్టింగ్‌ చేయాలి. టాలెంట్‌ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ఈ విషయంలో నేను బాగా కేర్ తీసుకుంటాను. సింగర్‌ సునీత వారసుడిగా ఎంట్రీ ఇవ్వడంతో నాపై మరింత బాధ్యత ఉంది. సునీత కొడుకు అంటే ఫ్యాన్స్ కొన్ని అంచనాలు ఉంటాయి. అవి నేను రీచ్ కాలేకపోతే ట్రోల్స్ తప్పవు. సినిమా ఆడితే ప్రశంసిస్తారు. లేదంటే ట్రోల్ చేస్తారు. అయితే రెండింటిని సమానంగా తీసుకునేందుకు నన్ను నేను సిద్ధం చేసుకుంటున్న.

Also Read: Salaar Song: సలార్‌ సాంగ్‌ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్‌

వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా తెలుసుకున్నాను. సందర్భం ఏదైనా, ఎన్ని విమర్శలు వచ్చినా, సినిమా బాగా లేదన్నా, యాక్టింగ్‌ గురించి మాట్లాడినా, మరే విమర్శలు చేసినా ఓపికగా భరించాలని అర్థమైంది. వాటినిభరిస్తూ, వర్క్ తోనే నేనోంటో చూపించాలనుకుంటున్నా. ఏదైనా ఓపికతో సాధించాలని అనుకుంటాను. నాకు బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంది కాబట్టి పెద్ద సినిమాలు చేయాలనుకోవడం లేదు.. కంటెంట్‌ ఉన్న సినిమాతో రావాలకున్నా. అందుకే ‘సర్కారు నౌకరి’ మూవీ కథను ఎంచుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

Show comments