తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్‌కు అంతు లేదు. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పటికీ ప్రత్యేకమే. రజనీ సినిమాలకు తెలుగులో చాలా మంది డబ్బింగ్ చెప్పారు. అయితే, గాయకుడు మనో తన ప్రత్యేకమైన వాయిస్‌తో రజనీ పాత్రలకు సరికొత్త వన్నె తెచ్చారు. ఎంతలా అంటే..? రజనీకాంత్ సినిమాల్లో మనో వాయిస్ ప్రేక్షకులకు అంతగా కట్టి పడేయడం వెనుక కారణం స్పష్టమే ఆయన డైలాగ్ డెలివరీ లో ఉన్న ఎనర్జీ, ప్యాషన్, టైమింగ్. అందుకే రజనీ అభిమానులు కూడా “మనో అంటే రజనీ వాయిస్” అనేలా భావిస్తారు. అయితే మనో తొలిసారి రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. అయితే ఆ అవకాశం రావడం వెనుక ఉన్న ఆసక్తికర కథను ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Also Read : Neha Kakkar : బాలీవుడ్ గాయని నేహా కక్కర్ పేరుతో రూ.5 లక్షల సైబర్ మోసం!
“రజనీ గారికి రెండు సీన్లకైనా డబ్బింగ్ చెబితే సంతోషమే అనిపించింది. ‘ముత్తు’ సినిమాలో ముసలి రజనీ పాత్రకు డబ్బింగ్ చేయమన్నారు. సరేనన్నా. రెండు సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పా. తర్వాత రజనీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది ‘ఎప్పటి నుంచి పూర్తి డబ్బింగ్ చెబుతారా?’ అని అడిగారు. ‘సర్‌కి నచ్చిందా?’ అని అడిగితే, ‘అవును, చాలా ఇంప్రెస్ అయ్యారు’ అన్నారు. అలా నేను రెండు పాత్రలకు 10 రోజులు డబ్బింగ్ చెప్పా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుంచి దాదాపు అన్ని రజనీ సినిమాలకు నేను వాయిస్ ఇచ్చాను. ‘శివాజీ’ సినిమా తర్వాత రజిని గారు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు,” అని మనో తెలిపారు.
