Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sing Geetham OTT Release: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నుంచి వచ్చిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). వైజయంతి మూవీస్ పతాకంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీ, గత నెల జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై క్లాసిక్ టాక్‌తో పాటు ప్రశంసలు అందుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయినట్లు తెలుస్తోంది. జులై 9వ తేదీ నుంచి ఈ క్రేజీ ప్రయోగాత్మక చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన స్వరాలు సమకూర్చగా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ కేవీ అనుదీప్, రాహుల్ రవీంద్ర, నివేద పేతురాజ్ వంటి స్టార్స్ క్యామియో పాత్రల్లో మెరిసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు.
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
కథ..
ప్రతాప్ (అయాన్) తన తండ్రి (రాహుల్ రవీంద్రన్) ఆస్తులు వెతుక్కుంటూ కుబేరపురం అనే ఊరికి వెళతాడు. ఆ కుబేరపురం నిజానికి ఒక చెట్టు కూడా లేని ఒక మైనింగ్ ప్రాంతంగా మారిపోయి ఉంటుంది. అయితే, ఆ కుబేర గోల్డ్ మైన్స్ లో తన తండ్రికి వాటా ఉందని తెలుసుకుని, ప్రస్తుతం ఆ మైన్ నడుపుతున్న రేణు (శాలిని)ని కలిసి వాటా పొందే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె దాన్ని ఒక విదేశీయుడికి అమ్మే ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకుని, తాను కూడా ఆ ప్రయత్నంలో భాగమవుతాడు. కాని, అదే మైన్ లో పనిచేస్తూ ఉండే గౌరి (అహిల్య బమ్రో) కారణంగా ఆ ఊరు మొత్తం ఒక శాపంలో చిక్కుకుంటుంది. ఆ శాపం వలన ఆ ఊరి వారందరి మాటలు, పాటల రూపంలోకి మారిపోతాయి. అయితే ఈ శాపం ఎందుకు వచ్చింది? ఆ శాపం నుండి ఆ ఊరి ప్రజలంతా విమోచనం చేసుకోగలిగారా? తన తండ్రి వాటా కోసం కుబేరపురం వచ్చిన ప్రతాప్ ఆ వాటా పొందగలిగాడా? చివరికి ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!