Site icon NTV Telugu

Simbaa: ఓటీటీలో రచ్చ రేపుతున్న ‘సింబా’

Simba

Simba

Simbaa getting Huge Response in Prime Video and Aha Video: వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా అనే సినిమా చేశారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన సింబా సినిమాతో మురళీ మనోహర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించగా ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా థియేటర్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రశంసలు వస్తాయి కానీ థియేటర్లో ఆడియెన్స్‌ నుంచి అంతగా రెస్పాన్స్ రాదు కానీ అలాంటి చిత్రాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తే టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా సింబా మూవీ కూడా ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఈ సింబా మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉందని మేకర్స్ వెల్లడించారు.

Wolf Attack: యూపీలో నరమాంస భక్షక తోడేళ్లు.. 13 ఏళ్ల బాలుడిపై దాడి..

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 6లో సింబా చిత్రం ట్రెండ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలతో ప్రకృతి విలయతాండవం చేస్తున్న టైంలో సింబాలోని డైలాగ్స్, సీన్స్ బాగానే వైరల్ అయ్యాయని చూపొచ్చు. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు. ఇక డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి మెసెజ్ ఇచ్చే చిత్రాన్ని తీశారని సినిమాకు ప్రశంసలు దక్కాయి. సంపత్ నంది కథ.. డైరెక్టర్ మురళీ మనోహర్ విజన్, మేకింగ్ ‌కు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారని అందుకే. సింబాకి ఓటీటీలో ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోందని వెల్లడించారు. ఓటీటీలోకి కొత్త చిత్రాలు వస్తూ ఉన్నా కూడా సింబా ఇప్పటికీ టాప్‌లోనే ట్రెండ్ అవుతోందని వారు ప్రకటించారు.

Exit mobile version