Site icon NTV Telugu

Telusu Kada : అందరికీ తెలిసేలా చేప్పేది ఆరోజే!

Telusu Kada Shoot

Telusu Kada Shoot

‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో సిద్దు జొన్నలగడ్డ యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించాడు. సిద్దు జొన్నలగడ్డ తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్వాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్దు, ఇప్పుడు దర్శకుడు నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 17, 2025 న విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది

Also Read:Arya 3: దిల్ వారసుడి కోసం ‘ఆర్య 3’ రెడీ

రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఈ ఇద్దరు హీరోయిన్లతో సిద్దు జొన్నలగడ్డ రొమాంటిక్ యాంగిల్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో ఈ చిత్రం హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందుతోంది. ‘తెలుసు కదా’ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం.

Also Read:CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర.. తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం

సిద్దు జొన్నలగడ్డ స్టైల్, డైలాగ్ డెలివరీ, హాస్యం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘డీజే టిల్లు’ సినిమాలో సిద్దు పాత్ర యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కూడా అలాంటి ఎనర్జిటిక్ పాత్రలో సిద్దు కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 17, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీపావళి సీజన్ సినిమాలకు అనుకూలమైన సమయం కావడంతో, ‘తెలుసు కదా’ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, త్వరలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టనున్నట్టు సమాచారం.

Exit mobile version