NTV Telugu Site icon

Siddharth : మిడిల్ క్లాస్ కథా నేపథ్యంతో వస్తున్న సిద్దార్ధ్ ‘3BHK’

Siddu

Siddu

తమిళ హీరో సిద్ధార్థ్ కు ఒకప్పడు అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్బ్ మార్కెట్ ఉండేది.. తెలుగులోనే ఇంకాస్త ఎక్కువ ఉండేది అని కూడా చెప్పొచ్చు. ఈ హీరో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిళ్లు వంటి సినిమాలు  175 డేస్ ఆడిన రోజలు ఉన్నాయి. ఒకప్పుడు సిద్దార్ధ్ సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్ ఉండేది. కానీ అదంతా గతం ఇప్పుడు ఈ హీరో సినిమా అంటే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావు అనేది ఒప్పుకోవాల్సిన సత్యం. ఆ మధ్య వచ్చిన చిన్ని హిట్ అయింది తప్ప మిగిలిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెల్లయో కూడా తెలియదు.

అయితే హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు సిద్దార్ధ్. తాజాగా సిద్దు తన లేటెస్ట్ సినిమాను అనాన్స్ చేసాడు. శ్రీ గణేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘3BHK’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర, యోగిబాబు ముఖ్య పాత్రల్లో  నటిస్తున్నారు. టీజర్ చూస్తే హిట్ కళ కనిపిస్తోంది, ఈ సినిమాతో అయిన సిద్దార్ధ్ హిట్ ట్రాక్ లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తుండగా అరుణ్ విశ్వ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.