NTV Telugu Site icon

‘ఓరేయ్, చంపేస్తా… పారిపో…’ అంటూ వారెంట్ ఇచ్చిన సిద్ధార్థ్!

Siddharth warning to netizen

ట్విట్టర్ లో మరోసారి హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు! ఆయన ఇలా పదే పదే సీరియస్ అవుతూ ఉండటం చాలా మందికి తెలిసిందే! తన మనసులోని మాటని నిర్మొహమాటంగా చెప్పేసే సిద్దూ పలు మార్లు వివాదాలకి కేంద్రం కూడా మారాడు. ఆయన విమర్శల్ని సమర్థించే వారు ఎందరుంటారో ఆయన ట్వీట్స్ ని ట్రోల్ చేస్తూ చెలరేగిపోయే వారు కూడా అందరే ఉంటారు. లెటెస్ట్ గా దివంగత నటుడు దిలీప్ కుమార్ ఫోటో పై ఓ నెటిజన్ కామెంట్ ‘బొమ్మరిల్లు’ స్టార్ కి కోపం తెప్పించింది…

Read Also : అమూల్యమైన నటుడికి… అమూల్ ఘన నివాళి!

దిలీప్ కుమార్ మరణంతో చాలా మంది నివాళులు అర్పించారు. సిద్ధార్థ్ కూడా తన సొషల్ మీడియా ఖాతాలో ఓ ట్వీట్ చేశాడు. దిలీప్ కుమార్ మహానటుడని, ఆయన నుంచీ ఈనాటి తరం ఎంతో నేర్చుకోవాలని అన్నాడు. అంత వరకూ బాగానే ఉన్నా ఓ నెటిజన్ మాత్రం కాస్త వింతగా కామెంట్ చేశాడు. సిద్ధార్థ్ పోస్ట్ చేసిన దిలీప్ కుమార్ ఫోటో చూసి అతను ‘అక్షయ్ కుమార్ లా ఉన్నాడు’ అన్నాడు! ఆ నెటిజన్ కు అలా ఎందుకు అనిపించిందోగానీ సిద్ధార్థ్ కు మాత్రం కోపం వచ్చేసింది! ‘ఓరేయ్! చంపుతా… ఇక్కడ నుంచీ ముందు పారిపో!’ అంటూ రిప్లై ఇచ్చాడు!

దిలీప్ కుమార్ ని చూసి అక్షయ్ కుమార్ అనుకోవటం కాస్త ఓవరే! కానీ, ఎవరో నెటిజన్ సరదాగా చేసిన కామెంట్ కి సిద్ధార్థ్ సీరియస్ గా రియాక్ట్ కావటం… ఇంకాస్త ఆశ్చర్యమే! ఎనీ వే, మన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లవ్వర్ బాయ్ నెక్ట్స్ మణిరత్నం వెబ్ సిరీస్ ‘నవరస’లో కనిపించబోతున్నాడు. ఓటీటీలో ఎలాంటి రియాక్షన్ సంపాదించుకుంటాడో…