అమూల్యమైన నటుడికి… అమూల్ ఘన నివాళి!

దివంగత బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కి అమూల్ తనదైన రీతిలో నివాళి అర్పించింది. ‘అమూల్ టాపికల్’ పేరుతో ఆ సంస్థ విడుదల చేసే క్రియేటివ్ పిక్స్ కి స్పెషల్ క్రేజ్ ఉండటం మనకు తెలిసిందే. అయితే, బుధవారం నాడు 98 ఏళ్ల దిలీప్ కుమార్ తుది శ్వాస విడవటంతో ఆయనని స్మరిస్తూ అమూల్ తన టాపికల్ విడుదల చేసింది. నెట్ లో వైరల్ గా మారిన అమూల్ నివాళి చిత్రం దిలీప్ కుమార్ పోషించిన అనేక పాత్రలతో నిండిపోయింది. ఇక ఎప్పుడూ కనిపించే అమూల్ బేబీ ఈసారి దిలీప్ కుమార్ సినిమాల్లోని ఓ కథానాయికల దర్శనం ఇచ్చింది! మొత్తం అమూల్ టాపికల్ బ్లాక్ అండ్ వైట్ లో ఉండటం కూడా అలనాటి మహానటుడ్ని అభిమానులకి మరింతగా గుర్తు చేసింది…

Read Also : గుండెపోటుతో మరణించిన హారర్ చిత్రాల నిర్మాత…

‘‘గంగా భీ, జమునా భీ, ఆద్మీ భీ, విధాతా భీ, హర్ అందాజ్ కా లీడర్’’ అంటూ అమూల్ ఇచ్చిన క్యాప్షన్ కూడా దిలీప్ అభిమానుల్ని ఆకట్టుకుంది. వయసు రిత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో దిలీప్ కుమార్ ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించాడు. ఆయన అంత్యక్రియలు జుహూలోని ముస్లిమ్ స్మశాన వాటికలో భార్య సైరా భాను, ఇతర బంధుమిత్రుల సమక్షంలో జరిగాయి…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-