Site icon NTV Telugu

Prabhas: ప్రభాస్ పెళ్ళికి షాపింగ్.. శ్యామలా దేవి ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas Marriage Shopping

Prabhas Marriage Shopping

Shyamala Devi Interesting Comments on Prabhas Marriage Shopping: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ప్రభాస్. ఆయన పెళ్లి గురించి కూడా ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఆయన పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32 లో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా జరివరం శారీస్ స్టోర్ ఓపెన్ ఐయింది. మేయర్ తో పాటు స్వర్గీయ కృష్ణం రాజు గారి సతీమణి శ్యామలాదేవి, యువ హీరో రక్షిత్ అట్లూరి వచ్చి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.

24 Frames Factory: మాకు యూట్యూబ్ వివాదానికి సంబంధం లేదు.. మంచు విష్ణు నిర్మాణ సంస్థ కీలక ప్రకటన!

అభిలాష రెడ్డి, గాయత్రి ( నటుడు కృష్ణుడు వైఫ్) ఇద్దరూ కలిసి ఎంతో ఫ్యాషన్ పెట్టిన స్టోర్ ఈ జరివరం కాగా ఇందులో అన్ని రకాల కలెక్షన్స్ తో పాటు కంచి పట్టు, ఆర్గంజా, బ్రైడల్ కు డిజైన్ తో కష్టమైజెషన్ కూడా ఉంటుందని ప్రకటించారు. ఇక ఈ క్రమంలో శ్యామలా దేవి మాట్లాడుతూ నాకు పర్సనల్ గా కంచి పట్టు అంటే ఇష్టం, ఇప్పుడు నేను వేసుకుంది కూడా కంచి పట్టునే..కృష్ణం రాజు గారు నాకు కొన్న ఫస్ట్ కంచి పట్టు చీర ఇదని చెప్పారు. అంతే కాకుండా ప్రభాస్ పెళ్ళి బట్టలు కూడా ఈ జరివరం నుండే కొంటామని ఆమె చెప్పారు. ఇక నటుడు కృష్ణుడు మాట్లాడుతూ: అభిలాష రెడ్డి,నా వైఫ్ గాయత్రి కలసి ఈ స్టోర్ స్టార్ట్ చేశారు, హైద్రాబాద్ లో ఉండే అతివలకు బెస్ట్ కలెక్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశం తోనే వాళ్ళు ఈ జరివరం స్టార్ట్ చేశారని అన్నారు.

Exit mobile version