Site icon NTV Telugu

Shruti Hassan : ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు..?

Sruthihasson

Sruthihasson

మల్టి ట్యాలెంటెడ్ హీరోయిన్ అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు శృతిహాసన్‌. స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు మంచి గాయని కూడా. ఇప్పటికే పలు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ ద్వారా తన ప్రతిభను చాటింది. తాజాగా తన తండ్రి నటించిన ‘థగ్‌లైఫ్‌’ చిత్రంలో శృతిహాసన్‌ పాడిన ‘విన్వేలి నాయగా..’ అనే పాట బాగా పాపులర్‌ అయింది. అర్థవంతమైన సాహిత్యం, రెహమాన్‌ అద్భుత స్వరరచన, శృతిహాసన్‌ మెస్మరైజింగ్‌ వాయిస్‌తో ఈ సాంగ్‌ సంగీతప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ అనుభూతిని తన అభిమానులతో పంచుకుంది శృతి హాసన్..

Also Read : Anushka : హీరోయిన్ అనుష్క కొంటె చూపులు.. నగరంలో 40 యాక్సిడెంట్స్..?

‘నాన్న కమల్‌హాసన్‌ నటించిన ‘థగ్‌లైఫ్‌’ చిత్రంలో పాట పాడటం ఓ జీవితకాల అనుభవం. ఇలాంటి అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. తండ్రి మూవీలో పాట పాడే అదృష్టం ఎంత మంది కూతుళ్లకు దక్కుతుందో తెలియదు కానీ, నిజంగా ఇదొక లైఫ్‌టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌. పాటను అద్భుతంగా ఆలపించానని రోజూ వందలకొద్ది మెసేజ్‌లు వస్తున్నాయి. ఇంటివద్ద పియానో మీద ఈ పాట ట్రాక్‌ను రిహార్సల్‌ చేశాను. అందుకే రికార్డింగ్‌ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. నా కెరీర్‌లో మెమొరబుల్‌ సాంగ్‌ ఇది’ అని శృతిహాసన్‌ పేర్కొంది.

Exit mobile version