శంతను హాజారికాతో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ ఐడెంటిటీ దక్కని పాత్రల్లో నటిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు క్రిటిక్స్. కూలీలో తలైవర్ రజనీకాంత్‌తో కలిసి నటించినప్పటికీ.. ఆమె కన్నా త్రీ మినిట్స్ స్పెషల్ సాంగ్‌లో నటించిన పూజా హెగ్డేనే అటెన్షన్ గ్రాబ్ చేసింది. తాజాగా పెద్దిలో స్పెషల్ సాంగ్ చేసినా జాన్వీ కపూర్ ముందు తేలిపోయింది. సినిమా ఫ్లాప్ కావడంతో శృతికి సరైన గుర్తింపు దక్కలేదు.
శృతి హాసన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. మిస్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న ట్రైన్‌లో నటిస్తోంది కమల్ డాటర్. ఎప్పుడో కంప్లీటైనా ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్లీ బీటీఎస్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఎక్కడా శృతి కనిపించలేదు. పేరుకే హీరోయిన్ అయినప్పటికీ.. జస్ట్ గెస్ట్ అప్పీరియన్స్‌కే పరిమితం చేశారా అనే డౌట్ పడేలా చేసింది ఈ బీటీఎస్ వీడియో. సలార్ తర్వాత తెలుగులో ఫుల్ లెంత్ రోల్‌లో కనిపించని శృతి, దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఓ తారలో కీ రోల్ ప్లే చేస్తుంది. రీసెంట్లీ ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. సాత్విక వీరవల్లి మెయిన్ హీరోయిన్. త్వరలో ఆకాశంలో ఓ తార ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరీ ఈ మూవీతోనైనా శృతికి ఐడెంటిటీ రోల్ దక్కతుందా..? లేదో లెట్స్ వెయిట్.

