Site icon NTV Telugu

Shruti Haasan: ఎందుకు అలా చేయకూడదు? సమర్థించుకోవాల్సిన అవసరం లేదు

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ శృతి హాసన్. ప్రస్తుతం శృతి వరుస సినిమాలతో బిజీగా మారింది. అయితే శృతి ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. అలా మాట్లాడే జాబితాలో శృతి హాసన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలా మాట్లాడే వారిలో కొంతమంది మాత్రమే ఇలా నేరుగా మాట్లాడగలరు. ఏం చేసినా మనసులో దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడడం ఈ భామకే చెల్లుతుంది. తండ్రి కమల్ హాసన్ లాగా శృతికి తన ప్రేమ వ్యవహారాలు వగైరా దాచడం ఇష్టం ఉండదు.

శృతి ఏ ఇంటర్వూలకు వెళ్లిన ముక్కు గురించి చర్చ రావాల్సిందే. అయినా దానికి సూటిగా సమాధానం చెబుతూనే వస్తుంది శృతి. అంతేకాదు తన అందాన్ని పెంచుకునేందుకు ముక్కుకు సర్జరీ చేయించుకున్నట్లు స్వయంగా శృతి హాసన్ ఒప్పుకుంది. ఇలా ఒప్పుకోవడం ఇదే మొదటిసారి కాదు. శృతి గతంలో చాలా ఇంటర్వ్యూలలో ముక్కుపుడక గురించి బహిరంగంగా మాట్లాడింది. ఇప్పుడు మరోసారి ఆప్రశ్న ఎదురైంది. ఇదే విషయంపై పదే పదే ప్రశ్నించిన వారికి ఘాటైన సమాధానం ఇచ్చింది గబ్బర్‌ సింగ్ భామ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శృతి తన ముక్కును సరిచేయడానికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించింది. అందంగా కనిపించడం కోసమే అలా చేశానని ఆమె అంగీకరించింది. ఇప్పుడు నాముక్కు చాలా స్పష్టంగా ఉందని ఆమె అన్నారు.

Read also: Buddha Venkanna: హరికృష్ణ పేరు వాడుకుని నాని బతికేస్తున్నాడు

అయితే శృతి మాట్లాడుతూ.. తన పాత ముక్కుతోనే మొదటి సినిమా చేశానని అయితే ఇటీవలి సినిమాల్లో చాలా డిఫరెంట్ గా కనిపించిందని చెప్పింది. తన డివియేటెడ్ సెప్టంను ఫిక్స్ చేయడంతో పాటు తన ముక్కును అందంగా మార్చగలిగితే తాను ఎందుకు అలా చేయకూడదు? అని కూడా శృతి హాసన్ ఎదురు ప్రశ్నించింది. శృతి హాసన్ లాజిక్‌ని తెరపైకి తెచ్చింది. అలా ఎందుకు కనిపించాలనుకుంటున్నాడో జస్టిఫై చేయాల్సిన అవసరం లేదని శ్రుతి సూటిగా చెప్పింది. నేను చేసే పని నన్ను చేయనివ్వండి,” అని చెప్పింది.

వర్క్ స్టార్ట్ చేశాక హీరోయిన్ గా కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. ఆమె విదేశీ ముఖంతో పాశ్చాత్య యువతిలా కనిపిస్తుందని మరికొందరు తెలిపారని కూడా ఆమెకు చెప్పారు. అయితే తన కెరీర్‌లో చాలా సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా నటించడం తనకు ఇంకా గందరగోళంగానే ఉందని చెప్పింది. అందాల శృతి హాసన్ ప్రస్తుతం సలార్ వంటి భారీ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఆమెకు పలు తెలుగు తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Gold Seized: ఎయిర్‌పోర్టులో 41 కిలోల బంగారం పట్టివేత.. 100 కేజీల వెండి స్వాధీనం

Exit mobile version