టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా మూడు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ శృతిహాసన్. సినిమాల్లో నటనతో పాటు, ఆమె వ్యక్తిత్వం కూడా ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫిజికల్ అప్పియరెన్స్, సోషల్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ వంటి విషయాల్లో ఆమె చూపే స్పష్టత, ఓపెన్‌నెస్ చాలా మందికి ప్రేరణగా మారింది. ఏ విషయం అయినా ఉన్నదున్నట్టు చెప్పడంలో ఆమె ఎప్పుడూ వెనుకడుగు వేయదు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలో తన ముక్కు పై ప్లాస్టిక్ సర్జరీ చేసిన విషయాన్ని ఒప్పుకున్న శృతి.. తాజాగా మరోసారి అదే అంశంపై ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు సూటిగా వివరించింది.
‘టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు. అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న. అంతేకాదు, ముఖం మరింత అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా వాడాను. ఇవన్నీ దాచాల్సిన అవసరం నాకు అనిపించలేదు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలను చెప్పానూ. కొంతమంది ఇలాంటి విషయాలను బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. నేను గౌరవిస్తాను. అలాగే, నా విషయాలను ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది. అది తప్పు కాదని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో వయసు పెరిగిన తర్వాత అవసరమైతే ఫేస్ లిఫ్ట్ చేయించుకునే అవకాశం ఉంది. ఇది పూర్తిగా నా నిర్ణయం. ఇతరులకు ఇబ్బంది లేకపోతే, నా శరీరం గురించి నేను తీసుకునే నిర్ణయాలను ఎవ్వరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చింది శ్రుతి. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘కూలీ’, ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
