సూపర్‌స్టార్ రజనీకాంత్, సీనియర్ నటి శ్రీయ శరణ్ కలసి ఉన్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రజనీకాంత్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ “హ్యాపీ డే” అని క్యాప్షన్ జోడించారు. వీరిద్దరూ గతంలో ‘శివాజీ: ది బాస్’ చిత్రంలో జంటగా నటించి సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయాన్నిఅందుకుంది.
తాజాగా ఈ పిక్ చూసిన సినీ అభిమానులు ‘శివాజీ’ ఐకానిక్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందా అని చర్చించుకుంటున్నారు. రజనీకాంత్ నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ధర్మన్’ మూడో షెడ్యూల్ నిన్ననే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సూపర్ స్టార్ రజనీ ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో శ్రీయ ఈ సెట్స్‌లో నుండి రజినితో దిగిన ఫోటో షేర్ చేయడంతో ఆమె సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తోందా లేక ఏదైనా స్పెషల్ డాన్స్ నంబర్‌లో రజనీతో కలసి చిందులేయనుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఫోటోతో ‘ధర్మన్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘శివాజీ’ కాంబో మళ్ళీ స్క్రీన్ పై మెరవనుందో లేదో తెలియాలంటే చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. అశ్విన్ మరిముత్తు డైరెక్ట్ చేస్తున్న ధర్మన్ సినిమాను భారీ బడ్జెట్ పై ఉలగనయగన్ కమల్ హాసన్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

