NTV Telugu Site icon

Shraddha Kapoor : సక్సెస్ పొగరుతో టాలీవుడ్ పై చిన్న చూపు

Bollywood

Bollywood

ఈ ఏడాది స్త్రీ2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు. ఇన్ స్టాలో ఫాలోవర్ల సంఖ్యలో ప్రధాని మోడీని దాటేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇండియాలోనే హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోయిన్‌గా తొలి స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ బడా ఖన్స్ ను సైతం వెనక్కు నెట్టింది శ్రద్ధ.  ఇక అక్కడ నుండి అమ్మడు పూర్తిగా మేకోవర్ అయ్యింది. రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. ఆమె కోసం వస్తోన్న దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ మేకర్లకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో బిత్తరపోతున్నారు.

Also Read : Rajinikanth : డిసెంబరు 12న జైలర్ -2 స్పెషల్ అప్ డేట్..?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప2 లో దెబ్బలు పడతాయ్ రాజా సాంగ్ కోసం ఫస్ట్ శ్రద్ధాకపూర్‌ సంప్రదించగా అందుకోసం ఈ భామ 8 కోట్లు డిమాండ్ చేసింది. దీంతో షాక్ గురైన ప్రొడ్యూసర్ శ్రీలీలను తీసుకున్నారు. ఇక నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తోన్న ప్యారడైజ్ సినిమా కోసం శ్రద్ధాకపూర్‌ సంప్రదిస్తే ఏకంగా రూ. 12 కోట్లు డిమాండ్ చేసింది. శ్రద్దాకు శ్రద్దగా వద్దనుకొని ఇతర ఆప్షన్స్ చూస్తున్నారు మేకర్స్. సాహో తర్వాత టాలీవుడ్‌పై శ్రద్ధ పెట్టని ఈ భామ ఇప్పుడు వస్తున్న ఆఫర్ల విషయంలో బిగ్ నంబర్స్ చెప్పి దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తుంది. అటు స్త్రీ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చిన వేటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.  ఇటు తెలుగు ఛాన్సులు వస్తుంటే కాలు దన్నుకుంటోంది అమ్మడు. కంటిన్యూగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడాన్ని బట్టి చూస్తే ఒక్క సినిమా సక్సెస్ తో గర్వం పెరిగిందని బి టౌన్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Show comments