Trikala : సనాతన ధర్మం సీక్రెట్స్ తో శ్రద్ధాదాస్ ‘త్రికాల’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాల ఆధారంగా.. ఓ మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్‌గా ‘త్రికాల’ ముస్తాబైంది. గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ అందించి, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా కంటెంట్ బాగా నచ్చడంతో చాగంటి ప్రొడక్షన్ LLP సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మే 29న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ప్రపంచంపై చీకటి కమ్ముకున్న విపత్కర పరిస్థితుల్లో, ఓ వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ఈ ‘త్రికాల’ కథ తిరుగుతుందని దర్శకుడు మణి తెల్లగూటి తెలిపారు. సనాతన ధర్మం, ఆధ్యాత్మికతకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో హై-క్వాలిటీ వీఎఫ్ఎక్స్ (VFX) పనులు ప్రేక్షకులకు ఓ గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి ఆర్య 2, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రద్ధాదాస్.. ఈ మూవీలో మునుపెన్నడూ చూడని విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ఆమెతో పాటు ‘మాస్టర్’ ఫేమ్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, వెర్సటైల్ యాక్టర్ అజయ్ పవర్ఫుల్ రోల్, సీనియర్ నటి ఆమని పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు సోషల్ మీడియాలో ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్, స్పిరిట్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమాలకు తన మార్క్ మ్యూజిక్ ఇచ్చిన హర్షవర్ధన్ రమేశ్వర్ ఈ ‘త్రికాల’కు సంగీతం అందిస్తుండటం విశేషం. ఆయన బీజీఎమ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. సినిమా అవుట్‌పుట్ చూశాక నార్త్ ఇండియాలో ఈ చిత్రానికి టేబుల్ ప్రాఫిట్ బిజినెస్ జరిగింది. హిందీ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ కళ్లు చెదిరే ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!