Site icon NTV Telugu

శంకర్ సినిమాకు కియారా షాకింగ్ పారితోషికం

స్టార్ దర్శకుడు శంకర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రానుంది. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ బ్యూటీ భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె డిమాండ్ చేసిన 5 కోట్ల రెమ్యునరేషన్ ను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదివరకు 2కోట్ల వరకు తీసుకొనే కియారా ఏకంగా ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం పెంచేయడం హాట్ టాపిక్ గా మారింది.

కియారా అద్వానీ ఇదివరకు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లాంటి హీరోతో భరత్ అనే నేను సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన ‘విన‌య విధేయ రామ’లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది.

Exit mobile version