తెలుగు సినీ పరిశ్రమలో రాజశేఖర్ – జీవిత దంపతుల గురించి పరిచయం అక్కర్లేదు. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టారు వారి ఇద్దరు కుమార్తెలు.. శివానీ, శివాత్మిక. కాగా ఇందులో 2019లో విడుదలైన ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది శివాత్మిక . తన తొలి సినిమాలోనే మంచి అభినయం చూపించి, సైమా ఉత్తమ నూతన నటి అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా.. శివాత్మిక నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత తెలుగులో పంచతంత్రం, రంగమార్తాండ వంటి సినిమాల్లో నటించింది.
Also Read : Rashmika : ఈ ప్రశంసలన్నీ శేఖర్ కమ్ముల వల్లే..రష్మిక ఎమోషనల్ పోస్ట్
అలాగే తమిళ చిత్రాలు ‘ఆనందం విలయదుం వీడు’, ‘నితమ్ ఒక్ వానం’ వంటి సినిమాల్లో నటిస్తూ కోలీవుడ్‌లోనూ రాణిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాల్లో గ్లామర్ షో కి ప్రాధాన్యం ఇవ్వకుండా.. నటనకు అవకాశమిచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే తెలుగులో ‘రంగమార్తాండ’ మూవీ తర్వాత శివాత్మిక నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.. ఈ అమ్మడు మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో టాలెంట్ కంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తక్కువగా ఉండటంతో కొన్ని సినిమాల నుంచి తీసేసారు. నా స్థానంలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వారిని తీసుకున్నారు. దీంతో మేనేజర్లు, ఏజెంట్లు అంతా ఫాలోవర్స్ పెంచుకోమని ఒత్తిడి తెశారు. కానీ నేను యాక్టర్‌ని.. కంటెంట్ క్రియేటర్‌ను కాదు. నా నటనతో నను గుర్తించాలి కానీ సోషల్ మీడియా నంబర్స్‌తో కాదు’ అంటూ తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
