NTV Telugu Site icon

Ashwin : శివంభజే ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ..

Untitled Design (8)

Untitled Design (8)

‘రాజు గారి గది’ చిత్రంతో  తొలిసారిగా సూపర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో అశ్విన్ బాబు. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే”. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. జై చిరంజీవ చిత్రం తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ తెలుగు తెరపై కనిపించనున్నాడు. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో రాబోతున్న శివం భజే ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదల కానుంది శివం భజే.

శివం భజే సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా రివ్యూ చేసిన తర్వాత నిబంధనలు అనుసరించి ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను అందించారు సెన్సార్ సభ్యులు. శివం భజే చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో రిలీజ్ చేయనుంది మైత్రీ మూవీస్. కంటెంట్ పై మైత్రీ మూవీస్ కొనుగోలు చేసినట్టు సమాచారం.దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితర తారాగణంతో రానున్న ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేయనుంది వర్ణిక విజువల్స్. శివం భజే చిత్రాన్ని ఓవర్సీస్ లో ఒక రోజు ముందు అనగా జూలై 31న ప్రీమియర్స్ ప్రదర్శించేందుకుఏర్పాట్లు చేస్తోంది వర్ణిక విజువల్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. ఈ చిత్రంపై అశ్విన్ బాబు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

Also Read : Prabhas: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ..షూటింగ్ ఎప్పుడంటే..?

Show comments