సాగర కన్య శిల్పా శెట్టి తనయుడు వియాన్ రాజ్ కుంద్రా ఆమె కోసం ఒక పవర్ ఫుల్ వీడియోను అంకితం చేశాడు. మే 7న శిల్పా కుటుంబం… భర్త రాజ్ కుంద్రా, పిల్లలు సమీషా, వియాన్, ఆమె తల్లి , అత్తమామలకు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలియజేశారు. ఆ తరువాత ఆమె కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకుంది. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా వియాన్ డీప్ ఫేక్ ద్వారా తన తల్లిని బాలీవుడ్ సూపర్ వుమన్ ‘హేలా’లా మార్చేశాడు. అందులో శిల్పా కరోనా వైరస్ తో పోరాడుతోంది. ఈ వీడియోను శిల్పా తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మే 21న వియాన్ బర్త్ డే సందర్భంగా కుంద్రా దంపతులు ‘ట్రఫుల్’ అనే కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చారు.
A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)