Site icon NTV Telugu

Nari Nari Naduma Murari: సంక్రాంతి మళ్లీ మొదలయ్యింది.. అసలైన ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’!

Nari Nari Naduma Murari

Nari Nari Naduma Murari

‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. జనవరి 14న ప్రేక్షల ముందుకు వచ్చిన ఈ సినిమా.. 2026 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. పండుగ సీజన్‌లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ అందుకుని.. ‘సంక్రాంతి విన్నర్’గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సినిమాకు వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

2026 సంక్రాంతి రేసులో ఐదు సినిమాలు ఉండడంతో నారీ నారీ నడుమ మురారికి ఎక్కువగా థియేటర్స్ దొరకలేదు. మూవీ హిట్ టాక్ అందుకోవడంతో.. మేకర్స్ థియేటర్ల సంఖ్యను పెంచారు. ఈ మేరకు నిర్మాత అనిల్‌ సుంకర సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘థియేటర్ల సంఖ్య పెరిగింది.. సంక్రాంతి మళ్లీ మొదలయ్యింది’ అని పోస్టర్‌లో రాసుకొచ్చారు. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. నారీ నారీ నడుమ మురారి సినిమాను మరిన్ని ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చాలా సెంటర్లలో హౌస్‌ఫుల్ షోలు నడుస్తుండగా.. మరికొన్ని థియేటర్లలో కూడా సినిమాను రిలీజ్ కానుంది. దాంతో సినిమా కలెక్షన్లు మరింత పెరగనున్నాయి.

Also Read: Ravi Teja Movies: రవితేజ సినిమాలు అంటే.. గ్లామర్ హీరోయిన్స్ ఉండాల్సిందే, లిస్ట్ పెద్దదే!

నారీ నారీ నడుమ మురారిలో శర్వానంద్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలు కలగలిపిన కథనం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. 2026 సంక్రాంతి పండుగకు సరైన ఎంటర్‌టైనర్ దొరికిందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫన్, ఎమోషన్, మెసేజ్.. ఇలా అన్నీ బ్యాలెన్స్ అయ్యాయనే టాక్ సినిమాకు బలంగా మారింది. మొత్తానికి నారీ నారీ నడుమ మురారి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది. థియేటర్లు పెరగడంతో రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version