Site icon NTV Telugu

Sharwa: డిజాస్టర్ డైరెక్టర్’తో శర్వా నెక్స్ట్?

Sharwanand

Sharwanand

టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే, ఎమోషనల్ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను మెప్పించడం శర్వానంద్ శైలి. తాజాగా శర్వానంద్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అలాగే ప్రస్తుతానికి డిజాస్టర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఒకప్పటి కమర్షియల్ కామెడీ కింగ్ శ్రీను వైట్లతో చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Drishyam3 : దృశ్యం -3.. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ వీడియో రిలీజ్

ఒకప్పుడు టాలీవుడ్‌లో ‘శ్రీను వైట్ల మార్క్ కామెడీ’ అంటే ఒక బ్రాండ్ ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్‌ను ఊపేసిన ఆయన, కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శర్వానంద్‌కు సరిగ్గా సరిపోయే ఒక పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనంతిక సనీల్ కుమార్ ను హీరోయిన్గా ఫిక్స్ చేద్దామని భావిస్తున్నారు. ఎంపిక కావడం విశేషం.

Also Read: Sabarimala Gold Theft: శబరిమల బంగారు దొంగతనంలో వెలుగులోకి సంచలన విషయాలు..!

‘మ్యాడ్’ (Mad) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై, తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ కేరళ కుట్టి, ‘8 వసంతాలు’ సినిమాతో మరింత ప్రేక్షకులకు దగ్గరయింది. అనంతిక కేవలం కంటికి అందంగా కనిపించడం మాత్రమే కాదు, మంచి క్లాసికల్ డ్యాన్సర్, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉన్న భామ. శర్వానంద్ వంటి అనుజ్ఞుడైన నటుడి సరసన ఈ యంగ్ బ్యూటీ ఎలాంటి కెమిస్ట్రీ పండిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో, శ్రీను వైట్ల మళ్ళీ తన పాత వైభవాన్ని అందుకుంటారా? శర్వానంద్ ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్ చేరుతుందా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version