Site icon NTV Telugu

సైన్స్ ఫిక్షన్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్

Sharwanand Green Signal to Science Fiction Movie

యువ నటుడు శర్వానంద్ తనను తాను మంచి నటుడిగా నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎప్పుడూ స్టార్‌డమ్ కోసం ఆశించకుండా సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతుంటాడు. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తాడు. ప్రస్తుతం శర్వానంద్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న శర్వాతో జోడి కట్టనుంది. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Read Also : ప్రభాస్ “ప్రాజెక్ట్ కే”లో సమంత ?

ఈ నేపథ్యంలో శర్వా తన నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా సైన్స్ ఫిక్షన్ మూవీ అని అంటున్నారు. సమాచారం ప్రకారం టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందనున్న సినిమాకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ ను నూతన దర్శకుడు రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. శర్వానంద్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Exit mobile version