NTV Telugu Site icon

Sharwa37 : కేరళలో సైలెంట్ గా పని కానిచ్చేసిన యంగ్ హీరో శర్వానంద్..

Untitled Design (32)

Untitled Design (32)

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్‌ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.  ఈ ఏడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్ – కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోగా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పటికి ఓటీటీ లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కూడా రాలేదు.  ప్రస్తుతం శర్వానంద్ సామజవరగమన ఫేం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  సాక్షి విద్య  శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. Sharwa 37 అనే వర్కింగ్ టైటిల్ తో తయారవుతున్న ఈ చిత్ర షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Also Read : Devara : దేవర డే – 1 కలెక్షన్స్ ఎంత రాబట్టనుందో తెలుసా..?

తాజగా  ఈ సినిమా నుంచి మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా కేరళ షెడ్యూల్ పూర్తి అయ్యిందని  తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. అందమైన లొకేషన్లలో 10 రోజుల షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయిందని తెలుపుతూ టీం ఫొటోను చిత్ర బృందం షేర్ చేసింది.  ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. . ఈ చిత్రంలో ఏజెంట్‌ ఫేం సాక్షి వైద్య మరో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శర్వానంద్‌ ఈ చిత్రంతో పాటు అభిలాష్‌ రెడ్డి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలోను ఓ సినిమాలో నటిస్తున్నాడు.  అలాగే సంపత్ నంది దర్శకత్వంలో 38వ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నాడు శర్వానంద్. వీటిలో ఈ సినిమా శర్వాకు హిట్ ఇస్తుందో చూడాలి