Site icon NTV Telugu

Shankar- Ranveer Singh: రణ్‌ వీర్ సింగ్ తో శంకర్ ‘వేల్ పరి’ ట్రయాలజీ

Ranveer

Ranveer

Shankar- Ranveer Singh: ‘ఇండియన్ 2’, ‘అపరిచితుడు’ రీమేక్ రైట్స్ వివాదాల నుంచి దర్శకుడు శంకర్ బయటపడ్డారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో RC15, కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతే కాదు హిందీలో రణవీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ తీస్తానని ప్రకటించిన దానికి భిన్నంగా వేరే ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మణిరత్నం అడుగుజాడల్లో నడవబోతున్నాడట శంకర్. మణిరత్నం ప్రముఖ తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా రెండు భాగాలుగా సినిమా తీసి మొదటి భాగంతో సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు శంకర్ కూడా మణిరత్నం లాగే ఫేమస్ నవల వేల్ పరి ఆధారంగా రణ్‌ వీర్ తో మూడు భాగాలుగా సినిమా తీయాలనుకుంటున్నాడట. సంగమ్ ఎరాలో పరంబునాడు ని ఏలిన వేల్ పరి అనే రాజు గురించిన కథే ఈ నవల. సంగమ్ ఎరా కాలం నాటి ప్రముఖ కవి కపిలర్ రాసిన నవల ఇది.

Read also: Polish Leader: యువతుల అతి మద్యపానమే సంక్షోభానికి కారణం.. పోలిష్‌ నేత సంచలన వ్యాఖ్యలు

చేర, చోళ, పాండ్య రాజులు రాజ్యకాంక్షతో నిర్దాక్షిణ్యంగా విస్తరించుకుంటూ పోయారు. స్వతంత్ర రాజులపై దండెత్తి వారిని అధీనంలోకి తీసుకుని వారి రాజ్యాలను సమీకరించారు. అలాగే పరంబు దేశాన్ని కూడా ముట్టడించారు. అయితే వేల్ పారి రాజు లొంగిపోవడానికి నిరాకరించటంతో యుద్ధం సంవత్సరాలపాటు సాగింది. వేల్ పారిని జయించలేని యోధుడని కీర్తిస్తూ వెనుదిరిగి వెళ్ళారు. ఈ నవల అద్భుతమైన సినిమా అడాప్టేషన్‌గా మార్చే అంశాలను కలిగి ఉండటంతో శంకర్ దృష్టి దీనిపై పడింది. జీవిత పాఠాలతో పాటు హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ, యాక్షన్ అడ్వెంచర్‌ కు స్కోప్ ఉండటంతో వీటిని మైండ్‌బ్లోయింగ్ విజువల్-ఎఫెక్ట్ సీక్వెన్స్‌లుగా ప్రొజెక్ట్ చేసే స్కోప్ ఉంది. అందుకే దీనిని భారీ బడ్జెట్‌తో బహుళ భారతీయ భాషల్లో మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నాడు శంకర్. రణ్‌వీర్ సింగ్‌తో ‘వేల్ పారి’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు శంకర్ రామ్ చరణ్ సినిమాతో పాటు కమల్ ‘భారతీయుడు 2’ని పూర్తి చేస్తాడట. ఈ లోగా అటు రణ్ వీర్ కూడా రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ సినిమాలు ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’, సంజయ్ లీలా బన్సాలీ ‘బైజు బావ్రా’ పూర్తి చేస్తాడని టాక్. మరి మణిరత్నం అడుగుజాడల్లో నడవబోతున్న శంకర్ దీనితో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
Crime in Hyderabad: రెండో భర్తతో భార్య.. పెట్రోల్ పోసి నిప్పంటిచిన మొదటి భర్త

Exit mobile version