Site icon NTV Telugu

Aditi Shankar: ఆఫర్లు కావలెను!

Aditi Shankar

Aditi Shankar

తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తన తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్తో 2025లో బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. నిజానికి ఇదే ఏడాది శంకర్ కూతురు అదితి శంకర్ కూడా భైరవం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పల్లెటూరి అమ్మాయిగా నటించిన ఆమె, ఈ చిత్రంలో తన నటనతో మెప్పించినప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది.

Also Read:Yellamma: ‘ఎల్లమ్మ’ ఉన్నట్టా? లేనట్టా?

నిజానికి తండ్రీకూతుళ్లిద్దరూ తెలుగు సినిమాలో తమ సత్తా చాటాలని భావించినప్పటికీ, ఈ రెండు చిత్రాలూ విఫలమవడంతో వారికి నిరాశ మిగిలింది. తమిళంలో రెండు చిత్రాలతో అడుగుపెట్టిన అదితి, ఇప్పుడు తెలుగులో కొత్త ఆఫర్‌ల కోసం ఎదురుచూస్తోంది. అసలే సినిమాలు లేవు దానికి తోడు ట్రాక్ రికార్డ్ అంత బాలేకున్నా ఆమె మాత్రం ఇక్కడ నిలబడి వరుస సినిమాలు చేయాలని ఆశగా ఎదురు చూస్తోంది. అదితి తదుపరి ప్రాజెక్ట్‌లతో టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

Exit mobile version