మార్వెల్ నుంచి మరో రెండు సూపర్ హీరోచిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. జూలైలో “బ్లాక్ విడో” రానుండగా… “షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్”సెప్టెంబర్ లో థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా మేకర్స్ “షాంగ్ చి” మూవీ సెప్టెంబర్ 3, 2021న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. మార్వెల్ సూపర్ హీరోల జాబితాలో ఉన్న ఈ “షాంగ్ చి” మిగతా హీరోలు స్పైడర్ మాన్, ఐరన్ మ్యాన్ అంతగా పరిచయం లేడు. 70ల కామిక్స్ పాఠకులకు ఈ హీరోతో ఎక్కువ అనుబంధం ఉండే అవకాశం ఉంది.
Read Also : చిరంజీవిని ఎందుకు లాగుతున్నారు ? : ప్రకాష్ రాజ్
జిమ్ స్టార్లిన్ (థానోస్ సృష్టికర్త), రచయిత స్టీవ్ ఎంగ్లెహార్ట్ (బాట్మాన్ సృష్టికర్తలలో ఒకరు) సృష్టిగా “షాంగ్-చి” 1973 లో కామిక్ స్పెషల్ మార్వెల్ ఎడిషన్ # 15 లో ప్రారంభమైంది. తరువాత పుస్తకం శీర్షిక “ది హ్యాండ్స్ ఆఫ్ షాంగ్-చి: మాస్టర్ ఆఫ్ కుంగ్ ఫూ”గా మార్చబడింది. 80లలో ఈ సూపర్ హీరో కామిక్ కు మంచి ఆదరణ ఉండేది. “షాంగ్-చి” శక్తులు ఎక్కువగా వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను కలిగి ఉంటాయి. కెనడియన్-చైనీస్ హీరో సిము లియు “షాంగ్-చి”గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
