టాలీవుడ్‌లో పోయిన వారం 2025 క్రిస్మస్ బరిలో డిసెంబర్ 25న అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో యువ హీరో రోషన్ మేక నటించిన ‘ఛాంపియన్’ ఒకటి. మరో యువ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ మరొకటి. ఈ రెండు సినిమాలు నువ్వా? నేనా? అన్నట్టుగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. ఛాంపియన్, శంబాల మూవీస్ బాక్సాఫీస్ దగ్గర మంచి దూకుడు మీద ఉన్నాయి. నాలుగు రోజుల్లో తమ తమ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టారు ఇద్దరు యంగ్ హీరోలు రోషన్, ఆది.
నాలుగు రోజుల్లో ‘ఛాంపియన్’ మూవీ వరల్డ్ వైడ్‌గా 11.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. ఫస్ట్ డే నాలుగున్నర కోట్లు, రెండో రోజు 2.40 కోట్లు, మూడో రోజు 2 కోట్లు, నాలుగో రోజు 2.6 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన ఛాంపియన్ మూవీకి.. ఈ జోరు ఇలాగే కొనసాగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీలో రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించగా.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు.
Also Read: Mana Shankara Vara Prasad Garu: గెట్ రెడీ.. మన ‘వరప్రసాద్’ గారు దిగుతున్నారు!
చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న ఆది సాయి కుమార్ ‘శంబాల’ మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల గ్రాస్ రాబట్టింది శంబాల. నిజానికి క్రిస్మస్ బరిలో ఛాంపియన్‌తో పాటు ఈషా, దండోరా, పతంగ్ వంటి చిత్రాలు పోటీలో ఉన్నాయి. కానీ మిగతా చిత్రాల కంటే శంబాలకి ఎక్కువగా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ విషయంలో ఆది ఫుల్ ఖుషీగా ఉన్నారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు చేసేలా ఉంది. మొత్తంగా యంగ్ హీరోలు రోషన్, ఆది మంచి సక్సెస్ అందుకున్నారు.
