NTV Telugu Site icon

Shalini Pandey: అతనితో శృంగార సీన్.. భయంతో బయటికి పరిగెత్తా.. షాలిని షాకింగ్ కామెంట్స్

Shalini Pandey News

Shalini Pandey News

Shalini Pandey Shocking Comments on Intimate Scene with Jaideep Ahlawat : అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా నట ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. హిస్టారికల్ డ్రామా చిత్రం ‘మహారాజ్’తో హీరోగా మారాడు. నిజానికి ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై విడుదల కాలేదు కానీ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21 న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు జునైద్ నటనకు కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. అంతే కాకుండా సినిమాలో చూపించిన కిషోరి పాత్ర కూడా జనాలకు బాగా నచ్చింది. కిషోరి పాత్రలో నటించిన షాలిని పాండే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ గా నటించిన షాలిని పాండే.. ఈ మూవీలో కూడా కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో కనిపించింది. ఈ క్రమంలోనే ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడుతూ అలాంటి సీన్స్ లో నటించడం అంత సులభం కాదని షాలిని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో శృంగార పరమైన సన్నివేశం ఒకటి ఉండగా దాని గురించి ఓ ఇంటర్వ్యూలో షాలిని ఆసక్తికరమైన కామెంట్ చేసింది.

Kalki 2898 AD: ఎక్కడెక్కడ కల్కి ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

ఈ సినిమాలో ఒక శృంగార భరితమైన సన్నివేశంలో నటించా, ఆ సీన్ షూట్ చేసే ముందు నేను బయటకి పరిగెత్తి పారిపోయా, ఎందుకంటే అప్పుడు చాలా ఒత్తిడిగా అనిపించిందని ఆమె అన్నారు. అలాంటి వాతావరణం, చీకటి ఉన్నప్పుడు తనకు భయం ఎక్కువని పేర్కొన్న ఆమె అందుకు ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగానని అన్నారు. అయితే దర్శకుడే అర్థం చేసుకుని నాకు స్పేస్ ఇచ్చారని, అప్పుడు ఆ సీన్ పూర్తి చేయగలిగినట్లు షాలిని పాండే చెప్పుకొచ్చింది. 1800లలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సిద్దార్థ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా జైదీప్ ఈ సినిమాలో స్త్రీలను అత్యాచారం చేసే పాత్రలో నటించారు. ఇక షాలిని పాండే అర్జున్ రెడ్డితో తన కెరీర్‌ని ప్రారంభించింది. సౌత్‌లో సూపర్‌హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’లో ఆమె నటించింది, ఆ కారణంగా ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషించగా యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు.