Site icon NTV Telugu

షకీలా చనిపోయింది… క్లారిటీ ఇచ్చిన నటి

Shakeela shares VIDEO message to dismiss rumours about her death

సీనియర్ నటి షకీలా కన్నుమూసినట్లు పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఈ రోజు ఉదయం షకీలా తన మరణం గురించి వచ్చిన వార్తలను కొట్టి పారేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా ఈ పుకారును సృష్టించిన వ్యక్తికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. “నేను ఇక లేనని కొన్ని వార్తలు వచ్చినట్టు విన్నాను. నిజానికి అలాంటిదేమీ లేదు. నా ముఖంలో పెద్ద చిరునవ్వుతో నేను నిజంగా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నా కోసం శ్రద్ధ తీసుకున్న వ్యక్తులకు ధన్యవాదాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరో నా గురించి చెడు వార్తలను వ్యాప్తి చేసారు. దీంతో నాకు చాలా కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి. అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేసిన వ్యక్తికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ప్రజలు నా గురించి ఆలోచించేలా చేసింది” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

Read Also : వీడియో : సితార పెయింటింగ్ పాఠాలు

తెలుగు, తమిళ చిత్రాలలో సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో నటించి అప్పట్లో సంచలనం సృష్టించిన షకీలా. ఆమె సినిమాలు అనేక భారతీయ భాషలలో డబ్ చేయబడ్డాయి. తర్వాత ఆమె సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం సినిమాల నుండి విరామం తీసుకుంది. లింగమార్పిడి కుమార్తె మిలాను దత్తత తీసుకుంది.

Exit mobile version