వీడియో : సితార పెయింటింగ్ పాఠాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తన సితార తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. వాస్తవానికి సితారకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెకు సంబంధించి ఏ పిక్ బయటకు వచ్చినా వెంటనే వైరల్ చేస్తుంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. సొంత యూట్యూబ్ ద్వారా అభిమానుల సంఖ్యను పెంచుకుంటోంది. తాజాగా అదే యూట్యూబ్ ఛానల్ లో వీక్షకులకు అక్రిలిక్ పెయింటింగ్ పాఠాలు చెప్పుకొచ్చింది. వీడియోలో స్కై పెయింటింగ్ ఎలా వేయాలన్న విషయాన్ని వివరంగా, స్పష్టంగా చెప్పడమే కాకుండా వేసి చూపించింది. ఇంత చిన్న వయసులోనే ఆమెకు ఉన్న పెయింటింగ్ అభిరుచి, టాలెంట్ ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Read Also : హృతిక్, విజయ్, సమంత, కియారా, దుల్కర్ మల్టీ స్టారర్!

మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” చిత్రంతో బిజీగా ఉన్నాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు. “సర్కారు వారి పాట” సంక్రాంతి బరిలో నిలవనుంది.

Related Articles

Latest Articles