Shakeela: ‘ది డర్టీ పిక్చర్లో చూపించినది అబద్ధం’.. సిల్క్ స్మితపై షకీలా సంచలన కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమలో తనదైన బోల్డ్ పాత్రలతో విపరీతమైన క్రేజ్ మరియు స్టార్డమ్ సొంతం చేసుకున్న నటి షకీలా (Shakeela). తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్టార్ హీరోల సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన రికార్డ్ ఆమె సొంతం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా.. నాటి గ్లామర్ క్వీన్, దివంగత నటి సిల్క్ స్మిత (Silk Smitha) తో తనకున్న అనుబంధాన్ని, ఆనాటి సినీ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న “సిల్క్ స్మిత షకీలాను చెంపదెబ్బ కొట్టింది” అనే సంచలన వార్తపై ఆమె తొలిసారి పూర్తి క్లారిటీ ఇస్తూ నిజానిజాలు వెల్లడించారు.
సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ (The Dirty Picture) వంటి సినిమాలలో చూపించినట్లు తామిద్దరం ఎప్పుడూ ప్రత్యర్థులం (Rivals) కాదని షకీలా స్పష్టం చేశారు. తను సినీ రంగ ప్రవేశం చేసిన మొదటి సినిమాలోనే సిల్క్ స్మిత మెయిన్ హీరోయిన్గా నటించగా, తాను ఆమెకు సిస్టర్ క్యారెక్టర్లో చిన్న పాత్ర చేశానని గుర్తు చేసుకున్నారు. సిల్క్ స్మిత 1996లో మరణించిన తర్వాత, 1999 చివరినాటికి మలయాళ చిత్ర పరిశ్రమలో తనకు ఊహించని స్టార్డమ్ వచ్చిందని వివరించారు. అలాగే.. ‘సిల్క్ స్మిత గనుక బతికి ఉండుంటే ఈ రోజు నాకు ఈ స్థాయిలో పేరు, గుర్తింపు వచ్చేవి కావేమో. ఆమె ఇండస్ట్రీకి ఎప్పుడూ నెంబర్ వన్ స్టార్. అంత అందమైన మహిళను నేను చూడలేదు. ఆమెకు చాలా గర్వం అని బయట అనుకుంటారు.. కానీ నా దృష్టిలో ఆమె గర్వపడే మనిషి కాదు. వ్యక్తిగత సమస్యల వల్ల ఆమెకు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండేవి, అందుకే అందరితో ఫ్రీగా మాట్లాడేవారు కాదు’ అని షకీలా పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఇక ఇండస్ట్రీలో ప్రచారంలో ఉన్న కొట్టుకునే వివాదం గురించి షకీలా అసలు కథను బయటపెట్టారు..‘ఒక సినిమా షూటింగ్ షాట్లో సిల్క్ స్మిత నన్ను గట్టిగా తన్నాల్సి ఉంది. అయితే సీన్ పండటం కోసం ఆమె నిజంగానే నన్ను చాలా గట్టిగా తన్నారు. ఆ దెబ్బకు నాకు డైరెక్టర్ ముందే నిజంగానే ఏడుపొచ్చేసింది, ఎంతో బాధపడ్డాను. కానీ షాట్ పూర్తయిన వెంటనే సిల్క్ స్మిత నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. ఆ తర్వాత నన్ను పక్కకు పిలిచి ‘నువ్వు టవల్లో ఉన్నావు. నీకు ఇలా దెబ్బలు తినడం ప్రాక్టీస్ లేదు కదా. సీన్ ఒక్క షాట్‌లోనే ఓకే అయిపోవాలనే ఉద్దేశంతోనే నేను కాస్త గట్టిగా తన్నాను. లేదంటే రీటేక్స్ పడి అందరి ముందు నువ్వు ఇబ్బంది పడతావు’ అని వివరణ ఇచ్చింది’ అయితే, సిల్క్ స్మిత అంత మంచి ఉద్దేశంతోనే చెప్పినప్పటికీ.. ‘సిల్క్ స్మిత షకీలాను కొట్టింది” అంటూ పెద్ద వివాదంగా ప్రచారంలోకి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?