ఇండియాలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దిగ్గజ నటులలో షారుక్ ఖాన్ కూడా ఒకరు. టీవీ సీరియల్స్ ద్యారా కెరీర్ ప్రారంభించి.. తర్వాత ‘దివానా’ సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు షారుక్. అనంతరం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ధూసుకెలుతూనే ఉన్నాడు. అయితే మనకు తెలిసి ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ కెరీర్ వెనుక ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. ఈ స్టెజ్‌కి వాలు వచ్చారు అంటే అంత ఇజీ కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొనే ఉంటారు. ఇలాంటి విషయాలు చాలా సందర్భాల్లో చాలా మంది హీరోలు చెప్పుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా షారుక్ ఖాన్ కూడా కెరీర్ తొలినాళ్లలో తాను అనుభవించిన ఆర్థిక ఇబ్బందుల గురించి.. ఓ షోలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
Also Read: Prem Nazir : ఒకే హీరోయిన్‌తో 130 సినిమాలు చేసిన ఏకైక హీరో ..
‘సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ళలో అద్దె చెల్లించేందుకు కూడా డబ్బు లేదు. ఇంటి నుంచి గెంటేశారు, రోడ్డుపై పడుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదు అనే భయం నాకు ఎప్పుడూ ఉంటుంది. అందుకే మంచి ఇల్లు కట్టుకున్నాను. ఒక సొంత ఇల్లు, చదువు ఉంటే ప్రపంచం మీ చేతిలో ఉన్నట్లే. ఉద్యోగం, డబ్బు లేకపోయినా పర్వాలేదు, కనీసం నిద్రించడానికి, కూర్చొని ఏడవడానికి, ఒక ఇల్లు ఉండాలి. అందుకే ప్రజంట్ యంగ్ స్టార్స్‌కు సొంత ఇల్లు కొనుగోలు చేయాలని సలహా ఇస్తాను. ఎవ్వరైనా ఇల్లు కొన్నామని చెప్పినా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు షారుక్..
